Tirumala : ఆదివారం తిరుమలకు వెళుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.

Update: 2025-11-30 05:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. భక్తులకు వసతి గృహాల కేటాయింపు విషయంలోనూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు కూడా ఇదే రకమైన రద్దీ ఉంటుందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కంపార్ట్ మెంట్లలోనే చేస్తున్నారు.

తిరుమలలో కిటకిట...
స్వామి వారి అన్న ప్రసాదం కేంద్రం వద్ద, లడ్డూ తయారీల కౌంటర్ వద్ద భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం ముందుగానే బుక్ చేసుకుని వచ్చిన వారు, ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకున్న భక్తులు, కాలినడకన వచ్చిన భక్తులతో తిరుమల నేడు కిటకిటలాడుతుంది. మరొకవైపు దిత్వా తుపాను హెచ్చరికతో కొంత ఇబ్బందులు ఎదువుతాయని భావించినప్పటికీ స్వామి వారి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. దిత్వా ఎఫెక్ట్ తిరుమలపై కూడా ఉండటంతో ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా ప్రయాణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,791 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,911 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News