అరుణాచలానికి లక్షలాది మంది భక్తులు
తమిళనాడులోని అరుణాచలం భక్తులతో కిటకిట లాడుతుంది
తమిళనాడులోని అరుణాచలం భక్తులతో కిటకిట లాడుతుంది. కార్తీక దీపం చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రోజున అరుణాచలాన్ని సందర్శిస్తుంటారు. నవంబర్ 4న పౌర్ణమి రోజున 5 లక్షల మందికి పైగా భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారని తమిళనాడు దేవాదాయ శాఖ తెలిపింది.
కార్తీక దీపాన్ని దర్శంచుకునేందుకు...
అరుణాచలంలో రాబోయే కార్తీక దీపాన్ని దర్శంచుకునేందుకు దాదాపు 40 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. మరి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అరుణాచలం భక్తులతో నిండిపోయింది. వసతి గృహాలు కూడా దొరకడం లేదు. అరుణాచలేశ్వరుడిని దర్శంచుకనేందుకు గంటల సమయం పడుతుందని భక్తుుల చెబుతున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.