Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేడు దర్శనం సులువుగానే

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.

Update: 2025-12-02 03:16 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. దిత్వా తుపాను ప్రభావం కూడా తిరుపతి జిల్లాపై ఎక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకోలేదు. తిరుమలలో గత కొద్ది కాలం నుంచి కొనసాగుతున్న రద్దీ ఈరోజు మాత్రం తక్కువగానే ఉండటంతో భక్తులు సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. గంటల కొద్దీ కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

నేడు లక్కీడిప్...
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు -డిప్ రిజిస్ట్రేషన్ ముగిసింది. దాదాపు 1.8 లక్షల టోకన్లు కోసం రికార్డ్ స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. 27వ తేదీ ఉ 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ లు కొనసాగాయి. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1.వ తేదీ 3 రోజులకు ఈరోజు ఆన్‌లైన్ లో ఈ-డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకన్లు కేటాయించనున్నారు. ఈ-డిప్ లో ఎంపికైన భక్తులకు ఆన్‌లైన్ లో టోకన్లు కేటాయింపు జరుగుతుంది. 9.6 లక్షల రిజిస్ట్రేషన్ ల ద్వారా 24, 05,237లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారని తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మిగిలిన ఏడురోజులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా ఉంటుందని తెలిపారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకంుడా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోగా పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,345 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 24,292 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News