Tirumala : తిరుమల వెళ్లేవారికి తీపికబురు.. స్వామిని కనులారా చూసేందుకు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో పాటు దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో భక్తుల రద్దీ తిరుమలలో తక్కువగానే ఉంది. గత రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడంతో స్వామి వారిని సులువుగానే భక్తులు దర్శించుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారిని చూసి తరిస్తున్నారు. ఇటీవల కాలంలో శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ నెలలో రద్దీ మరింతగా...
ఇక ఈ నెలాఖరు నుంచి వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హుండీ ఆదాయం కూడా ఎక్కువగా టీటీడీకి సమకూరుతుంది. భక్తుల స్వల్ప సంఖ్యలో వచ్చినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం ఘనంగానే శ్రీవారికి అందుతుంది. మరొకవైపు తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నారని తెలిసి తిరుపతి నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు స్థానికులు అధికంగా వస్తున్నారు. అందుకే తిరుమలకు భక్తుల రాక మధ్యాహ్నం నుంచి మళ్లీ మొదలవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోగా పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,887 మంది భక్తులు దర్వించుకున్నారు. వీరిలో 22,561 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.