Tirumala : తిరుమలకు వెళుతున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. గత కొద్ది నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. లడ్డూల ద్వారా విక్రయం ఆదాయం కూడా పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అలాగే అన్న ప్రసాదానికి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని, గతం కంటే అన్న ప్రసాదానికి హాజరయ్యే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అనేక రకాలుగా...
తిరుమలకు వచ్చే భక్తుల కోసం అనేక రకాలుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్లు ఇవ్వడంతో త్వరగా వారు దర్శనం అయ్యేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇక తిరుపతిలో ప్రతి రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో వాటిని తీసుకున్న భక్తులకు కూడా తక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకునే వీలుంది. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది. ఇక బ్రేక్ దర్శనాలు కూడా ఉన్నాయి. అందుకే తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,369 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.