Srsailam : శ్రీశైలంలో స్పర్శదర్శనం రద్దు
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ వరకూ స్పర్శదర్శనాలను నిలిపివేశారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ వరకూ స్పర్శదర్శనాలను నిలిపివేశారు. భక్తులు దీనిని గమనించాలని ఆలయ కమిటీ కోరుతుంది. ఈ నెల 8వ తేదీ వరకూ శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. కార్తీక మాసంలో శివదీక్షలు ధరించిన వారు ప్రస్తుతం దీక్షా విరమణ చేస్తున్నారు. దీంతో శివ భక్తుల రద్దీతో శ్రీశైలం కిటకిట లాడుతుంది.
శివభక్తుల కోసం...
అందుకే మరో నాలుగు రోజుల పాటు స్పర్శదర్శనం శ్రీశైలంలో ఉండదని, భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. శివభక్తులకు ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతోనూ, వారికి సత్వరమే స్వామి దర్శనం కావాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన సేవలు మాత్రం యధాతధంగా కొనసాగుతాయని, భక్తులు వీటిని గమనించి రావాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.