నేడు కార్తీక మాసం చివరి సోమవారం

నేడు కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

Update: 2025-11-17 02:33 GMT

నేడు కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ నెలలో గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈరోజు ఆలయాలకు వచ్చి ఉపవాసం ఉండనున్నారు.

నేడు శివాలయాల్లో...
ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలు కూడా భక్తులతో నిండిపోయాయి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.


Tags:    

Similar News