Tirumala : నేడు తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది

Update: 2025-12-03 03:06 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. పెద్దగా వేచి ఉండకుండానే ఏడుకొండలవాడిని భక్తులు దర్శించుకుంటున్నారు. గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దిత్వా తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాపై ప్రభావం ఉందని చూపడంతో భక్తుల రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే నేడు భక్తుల రద్దీ తగ్గినప్పటికీ వచ్చే శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

తక్కువ సంఖ్యలో...
తిరుమలలో ఇటీవల వర్షం కూడా ఎక్కువగా పడుతుంది. మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. ఈ సమయంలో ఘాట్ రోడ్ లో ప్రయాణం ప్రమాదకరమని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండటంతో ఇప్పుడు సహజంగానే భక్తుల రద్దీ కొంత తగ్గుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. కానీ శుక్ర వారం నుంచి సోమవారం వరకూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చిన భక్తులకు సులువుగానే వసతి గృహాలు లభ్యమవుతున్నాయి.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్ లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం గంటలోనే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,684 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,515 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News