Tirumala : తిరుమలకు నేడు వెళితే.. మీరు ఎన్ని గంటలు వెయిట్ చేయాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-11-28 03:10 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం భక్తుల రద్దీ పెరుగుతుందని ముందుగానే అంచనా వేసింది నిజమే అయింది. అధికారులు కూడా శుక్రవారం నుంచి సోమవారం వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుందని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

భారీ స్పందన...
ఇటీవల కాలంలో హుండీ ఆదాయం కూడా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇక వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక్కరోజులోనే ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనానికి 4.60 లక్షల మంది నమోదు చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రారంభమయిన గంటలోపే 2.16 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. డిసెంబరు1 తేదీ వరకూ ఈ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి పదోతేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది.
ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,548 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,781 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News