Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారు భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

తిరుుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-12-05 04:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ సహజంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువగా ఉండటంతో టీటీడీ అధికారులు కూడా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. అయితే వచ్చిన భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు...
తిరుమలలో నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్ లైన్ లో విడుదల చచేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 51,082 మంది భక్తులుదర్శించుకున్నారు. వీరిలో 19,836 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News