Tirumala : తిరుమలలో ఘాట్ రోడ్డులో ప్రయాణంలో జాగ్రత్త.. తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2025-12-01 03:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులు ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తతలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షం పడుతుండటంతో...
తిరుమలకు భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. అందులోనూ వర్షం ఎక్కువగా పడుతున్న సమయంలో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయి. వాహనాలు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తిరుమలకు వెళ్లే సమయంలోనూ, అలాగే కొండ దిగే సమయంలోనూ ఘాట్ రోడ్డులో ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. వేగంగా కాకుండా నిదానంగా ప్రయాణిస్తూ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,187 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,027 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News