Breaking : ఏపీలో బాణాసంచా పేలి.. ఎనిమిది మంది స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

Update: 2025-10-08 08:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. బాణాసంచా కేంద్రాల్లో పేలుడు జరిగి ఆరుగురు మరణించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీపావళి పండగ కోసం...
మందుగుండు తయారు చేస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించి ఆరుగురు మరణించారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీపావళి సమీపిస్తుండటంతో భారీగా బాణా సంచా తయారు చేస్తున్నారు. గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పొలాల మధ్యలో ఉన్న ఈ గోదాములో పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు.



Tags:    

Similar News