Nellore : మాఫియా గ్యాంగ్ లు..నెల్లూరు నేరగాళ్లకు నిలయంగా మారిందెందుకు?

నెల్లూరు అంటే చాలా ప్రశాంతతకు మారు పేరు. నేరాలకు నిలయంగా నేడు మారింది

Update: 2025-12-02 06:49 GMT

నెల్లూరు అంటే చాలా ప్రశాంతతకు మారు పేరు. చెన్నైకి సమీపంలో ఉండటంతో ఎక్కువ సంబంధాలు తమిళనాడుతోనే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బంగారు వ్యాపారానికి పుట్టినిల్లు అని చెప్పాలి. అయితే గత రెండేళ్ల నుంచి నెల్లూరు హత్యలకు నిలయంగా మారింది. పెన్నా నదీతీరంలో ఉన్న సింహపురి వరి ధాన్యానికి ఫేమస్. అలాగే సినిమాలకు కూడా ప్రసిద్ధి. అలాంటి నెల్లూరు నేడు నేరాలకు నిలయంగా మారింది. నార్కొటిక్స్‌ హబ్‌గా నెల్లూరు మారింది. హత్యలు, దోపిడిలు, గంజాయి సంస్కృతి ఇటీవల కాలంలో మరింత పెరిగింది. అసలు రౌడీషీటర్లు, లేడీ డాన్లు ఇంత మంది నెల్లూరులో ఉన్నారా? అన్న నిజం సింహపురి వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జైలు నుంచే...
కొందరు రౌడీషీటర్లు జైళ్ల నుంచే గంజాయి, రౌడీయిజం ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఒడిషా నుంచి షిప్‌లో ఏపీకి గంజాయి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి బైక్స్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో రవాణా సాగుతుంది. మూడు అంచెల్లో గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క నెల్లూరులోనే 30 మంది సప్లయర్స్‌ ఉన్నారని పోలీసులు గుర్ించారు. 300 మంది డెలివరీ బాయ్స్‌ నెట్‌వర్క్‌ తో యధేచ్ఛగా నెల్లూరులో గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీపీఎం నేత పెంచలయ్య హత్యకు 300 రూపాయల గంజాయి ప్యాకెట్‌ కారణం అని అంటున్నారు. పీకలు కోసే సంప్రదాయానికి కూడా నెల్లూరు రౌడీషీటర్లు తెగిస్తున్నారు.
ఇతర జిల్లాల్లో హత్య కేసుల్లో...
ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా నెల్లూరు క్రిమినల్స్ సుపారీ తీసుకుని మరీ చేశారని పోలీసులే చెబుతున్నారు. నెల్లూరు ఒకప్పుడు నిజాయితీ, నమ్మకం, ప్రేమకు పేరుపొందిన నగరం. అయితే ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డ్రగ్స్, రౌడీయిజం నెల్లూరులో జైలు నుంచే నడుస్తున్నాయి. నెల్లూరు నేరగాళ్లకు నిలయంగా మారింది. లేడీ డాన్ లు అరుణ, అరవ కామాక్షిలు నెల్లూరు నగరాన్ని శాసిస్తున్నారు. అసలు నెల్లూరులో ఇంత మంది రౌడీషీటర్లున్నా లేడీ డాన్ లు మాత్రం చక్రం తిప్పుతున్నారంటే నెల్లూరు వాసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాఫియా సామ్రాజ్యానికి రాణులుగా చెలామణి అవుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా నెల్లూరు మాఫియా గ్యాంగ్ పై ఉక్కుపాదం మోపి మునుపటి నెల్లూరులా మార్చాలని నగర వాసులు కోరుకుంటున్నారు.


Tags:    

Similar News