Telangana : మాజీ నక్సలైట్ దారుణ హత్య

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు

Update: 2025-11-28 02:26 GMT

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. తంగాలపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్ ను హత్య చేశారు. అయితే నరసయ్యను హత్య చేసిన తర్వాత సంతోష్ తర్వాత జగిత్యాల పోలీసులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రిని చంపినందుకేనని...
నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా సంతోష్ తండ్రి చంపినట్లు ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పాడు. తన తండ్రి ని చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ పథకం ప్రకారం అగ్రహారం గుట్టలకు పిలిపించి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడు సంతోష్ ను విచారిస్తున్నారు.


Tags:    

Similar News