Road Accident : తమిళనాడులో ఐదుగురు ఏపీకి చెందిన భక్తులు మృతి
తమిళనాడులోని రామనాధపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీకి చెందిన వారు మరణించారు.
తమిళనాడులోని రామనాధపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీకి చెందిన వారు మరణించారు. అయ్యప్ప మాల వేసుకుని శబరిమలలో దర్శనం చేసుకుని రామేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం కారులో వస్తున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మరొక కారును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో...
గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతన్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.