4 కోట్ల బీమా కోసం

మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి

Update: 2025-12-03 14:30 GMT

మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి, ఆ డబ్బు కోసం అతడిని టిప్పర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ తమ్ముడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. మామిడి నరేశ్‌ వ్యాపారాలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు ఒకటిన్నర కోట్ల అప్పులు చేశాడు. అప్పుల నుంచి బయటపడేందుకు తన అన్న వెంకటేశ్‌ ను చంపాలని కుట్ర పన్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేని, అవివాహితుడైన వెంకటేశ్‌ పేరు మీద 4 కోట్లకు పైగా విలువైన తొమ్మిది బీమా పాలసీలు చేశాడు. తన స్నేహితుడు నముండ్ల రాకేశ్‌, టిప్పర్‌ డ్రైవర్‌ మునిగాల ప్రదీప్‌లతో కలిసి హత్యకు పథకం వేసి చంపించాడు. బీమా క్లెయిమ్ కోసం వెళ్లినప్పుడు నరేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బీమా సంస్థ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే మొత్తం బండారం బయట పడింది.

Tags:    

Similar News