పిఠాపురంలో మేనమామ కిరాతకం
మేనమామ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది
pithapuram rape incident of girl
తన చేతుల్లో పెరిగిన సొంత మేనకోడలిపైనే ఓ మేనమామ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పిఠాపురం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.పోలీసులు కథనం ప్రకారం ఒక గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను ఆమె తల్లి నవంబరు ఏడో తేదీ రాత్రి 7 గంటల సమయంలో సమీపంలోనే ఉన్న మేనమామ ఇంటికి వెళ్లి పాలు తీసుకురమ్మని పంపింది.
బాలికపై అత్యాచారం...
బాలిక అక్కడికి వెళ్లగా, పాల గిన్నె కనిపించడం లేదంటూ మేనమామ ఆమెను ఇంట్లోకి రమ్మని చెప్పి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పిఠాపురం సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు అత్యంత దగ్గరి బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.