నెల్లూరు లేడీ డాన్ పై తిరగబడిన స్థానికులు

నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి నివాసాన్ని స్థానికులు ధ్వంసం చేశారు.

Update: 2025-12-02 02:23 GMT

నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి నివాసాన్ని స్థానికులు ధ్వంసం చేశారు. గంజాయి వ్యాపారం చేయడంతో పాటు హత్యలు చేయించడంలో అరవ కామాక్షి పై ఆగ్రహం చెందిన స్థానికులు ఆర్డీటీ కాలనీలోని ఆమె నివాసంపై దాడి చేసి ధ్వంసం చేశారు. నెల్లూరు నగరంలో ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తూ హ్యత్యలు చేయిస్తున్న అరవ కామాక్షి ఇక్కడ ఉండటానికి వీలులేదని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇళ్లను ధ్వంసం చేసి...
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమె తిరిగి తమ ప్రాంతానికి రాకూడాదని భావించిన స్థానికులు అరవ కామాక్షి ఇంటిని ధ్వంసం చేశారు. అందరూ కలసి వెళ్లి ఆమె ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆమెకు అనుచరులుగా వ్యవహరిస్తున్న వారి ఇళ్లను కూడా ధ్వంసం చేయడం విశేషం.


Tags:    

Similar News