Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కృష్ణాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కారు అదుపు తప్పి...
ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. ముగ్గురు మరణించారు. అతి వేగం, పొగమంచు కారణంగానే కారు డివైడర్ ను ఢీకొని ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.