Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం ...11 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదకొండు మంది మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగ జిల్లా తిరపత్తూరులో విషాదం నెలకొంది. రెండు బస్సులు ఢీకొట్టడంతో పదకొండు మంది మరణించారు. నలభై మందికి పైగానే గాయపడ్డారు. రెండు తమిళనాడు ప్రభుత్వ బస్సులే. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా వస్తున్న బస్సులు ఢీకొన్నాయి. ఒక మలుపు వద్ద అతి వేగంగా వస్తున్న బస్సులు ఢీకొట్టడంతో ప్రయాణికులు సీట్లలోనే ఇరుక్కుపోయారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే....
బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. రెండు బస్సులు ఢీకొట్టడంతో ఆ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు రెండు బస్సులను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేే పనిలో ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.