Gold Prices Today : బంగారాన్ని కొనడం కలే.. వెండి సొంతం చేసుకోవడం అసాధ్యం

ఈరోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది.

Update: 2026-01-26 03:42 GMT

పసిడి ధరలు ఇక అందనంత దూరంలో ఉన్నాయి. ఎప్పుడో ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఏ రోజూ బంగారం ధరలు తగ్గిన దాఖలాలు లేవు. బంగారం దిగివస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురవుతుంది. బంగారం కొనుగోలు చేయాలంటే ఇక కలగా మిగిలి పోతుందన్న భావన మొదలయింది. బంగారం అనేది ఒక అపురూపమైన వస్తువుగా ఇప్పటికే మారింది. వెండి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం కూడా కష్టమే. గతంలో మాదిరిగా వెండి, బంగారాన్ని ఎప్పుడప్పుడంటే అప్పుడు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అవసరమున్నా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. ఇక శుభకార్యాలకు మాత్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి రావడంతో అవసరం మేరకే కొనుగోలు చేస్తున్నారు.

బంగారం, వెండికి ప్రత్యేక స్థానం...
భారతీయ సంప్రదాయంలో బంగారానికి, వెండికి ప్రత్యేక స్థానం ఉంది. బంగారం అంటే ఒక సెంటిమెంట్ గా పూర్వకాలం నుంచి నిలిచిపోయింది. అందుకే బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తహతహలాడుతుంటారు. కానీ పెరుగుతున్న ధరలను చూసి చాలా మంది బంగారం విషయంలో వెనకడగు వేస్తున్నారు. రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ కే నేడు పరిమితమవుతున్నారు. శుభకార్యాలకు, వివాహాలకు మహిళల మెడల్లో, చేతులపైన మెరిసే బంగారం చాలా వరకూ మేలిమి బంగారం కాదన్నది అందరూ ఒప్పుకుంటున్నారు. గత ఏడాది మాదిరిగానే.. ఈ ఏడాది.. గత వారం మాదిరిగానే .. ఈ వారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముంటుంది.
వచ్చే నెల నుంచి...
ఇక వచ్చే నెల నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. అంటే శుభకార్యాలు, పెళ్లిళ్లు జోరుగా జరగనున్నాయి. అయితే డిమాండ్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతుండటంతో పసిడి ప్రియులు వీటిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈరోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. గత వారం బంగారం పది హేను వేల రూపాయలు పెరిగితే, వెండి ధరలు కిలోపై నలభై వేలు పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,890 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,60,250 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 3,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఇంకా ఎంత ధరలు పెరుగుతాయన్నది చెప్పలేం.


Tags:    

Similar News