Gold Prces Today : షాకిచ్చిన బంగారం ధరలు.. షేక్ చేస్తున్న వెండి ధరలు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వెండి ధరలు మండిపోతున్నాయి. గత పదమూడు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక సామాన్యులు, మధ్యతరగతి, వేతనజీవులకు మాత్రం కష్టమేనన్నది వాస్తవం. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ధరలు అందుబాటులో లేవు. అలాగే వెండి ధరలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. బంగారం, వెండి ర్యాలీ కొనసాగుతుండటంతో పసిడి ప్రియులు ఇక కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. తద్వారా అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి. జ్యుయలరీ దుకాణాల యజమానులు ఎన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ ధరలను చూసి వినియోగదారులు అటు వైపు చూడలేదు.
రానున్న కాలంలో...
బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైపైకి ఎగబాకుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాల ఫలితంగా బంగారం, వెండి వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. గత ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన బంగారం, వెండి ధరలు ఈ ఏడాది జనవరి నెలలో కూడా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి పతనం కావడంతో పాటు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ఇరాన్ లో నెలకొన్న సంక్షోభం వంటి పరిస్థితులు బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధరలు మరింతగా...
ఇక రానున్న కాలంలో శుభకార్యాలు ఉండటంతో బంగారం, వెండి ధరలు మండిపోతాయి. డిమాండ్ కు తగినట్లుగా దిగుమతులు కూడా లేకపోవడం బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదలకు కారణం. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర పై మూడు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,900 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,60,260 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,65,00 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.