Gold Price Today : ఉగాది నాటికి బంగారం ఎంత పెరుగుతుందో తెలుసా?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2026-01-22 03:57 GMT

బంగారం ధరల పెరుగుదల ఇక ఆగేటట్లు కనిపించడం లేదు. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు పదమూడు నెలల నుంచి బంగారం ధరలు ఎంత పెరిగాయంటే ఊహించుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది. వేల రూపాయల ధరలు పెరగడంతో వాటిని కొనుగోలు చేసే వారు దాదాపు పూర్తిగా తగ్గిపోయారని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. దాదాపు డెబ్భయి శాతం అమ్మకాలు ఈ ఏడాదిలో తగ్గిపోయాయని అంటున్నారు. ఇక దుకాణాలకు వచ్చే వారిలో ఇరవై ఐదు శాతం మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన వారు ధరలను చూసి కొనకుండా వెనుదిరిగి వెళుతున్నారని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.

రానున్న కాలంలో
ఇక రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఉగాది నాటికి.. అంటే మార్చి సమయానికి బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయని అంటున్నారు. పది గ్రాముల బంగారం ధర దాదాపు రెండు లక్షల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. కిలో వెండి ధర కూడా మూడు న్నర లక్షలకు చేరువలో ఉంటుంది. ఉగాది పండగ నాటికి ధరలు పెరుగుతాయని అందుకే ముందుగా కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముండటంతో కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శుభకార్యాలుండటంతో...
ఫిబ్రవరి నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు మొదలు కానుండటంతో ఇక బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,661 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,45,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది.




Tags:    

Similar News