Gold Prices Today : పండగ పూట కూడా పసిడి శాంతించలేదుగా.. వెండి చిక్కడం కష్టమే
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది
పండగ వేళ కూడా పసిడి ధరలు పెరగడం ఆగడం లేదు. వెండి ధరలు అయితే దొరకడం కష్టమేఅవుతుంది. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువలో ఉంది. అలాగే వెండి ధరలు కిలో మూడు లక్షల రూపాయలు దాటేశాయి. దీంతో వినియోగదారులు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి భయపడిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బంగారం, వెండి ఆభరణాల వైపు చూడటం ఎప్పుడో మానేశారు. దాదాపు చాలా మందిలో బంగారం కొనాలన్న ఆసక్తి చచ్చిపోయిందనే చెప్పాలి.
కొనుగోళ్లపై ప్రభావం...
పండగలు, పబ్బాలకు గతంలో బంగారాన్ని విరివిగా కొనేవారు. అలాగే పెళ్లిళ్లు, పేరంటాళ్లకు కూడా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం హాబీగా పెట్టుకున్నారు. భారత దేశంలోనే బంగారం, వెండి వస్తువుల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు ఎక్కువ. భారత దేశంలో అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం, వెండిపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయినా గత కొద్ది రోజుల నుంచి ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనులు చేయడం మానేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంత కొనుగోలు చేసిన తంతును మ.. మ అని ముగించేస్తున్నారు. కట్నాలు, కానుకల పెట్టే విషయంలో ఇప్పుడు బంగారాన్ని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.
నేటి ధరలు...
పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే ఒక్కసారి ధరలు పతనమయితే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని భయపడిపోతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,07,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.