Gold Price Today : బంగారం రానున్నకాలంలో ఎంత పెరుగుతుందో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి బంగారానికి మించి వెండి ధరలు మరింతగా పరుగులు పెడుతున్నాయి. బంగారం, వెండి విషయంలో ఇక వేరే ఆలోచన చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అవి ఇప్పటికే కొన్ని వర్గాలకు దూరం అయ్యాయి. మరికొన్ని వర్గాలకు చేరువగా ఉన్నప్పటికీ వారు కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు అలంకారం కోసం.. సెంటిమెంట్ కోసం బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ నేడు బంగారం, వెండి కొనుగోలు శక్తికి మించి భారంగా మారింది.
ఎప్పుడూ డిమాండ్...
బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎన్ని జనరేషన్ లు మారినా బంగారానికి ఉన్న క్రేజ్ తగ్గలేదు. వెండిపై ఉన్న ప్రేమ కూడా ఏ మాత్రం తరగలేదు. అమ్మమ్మల నుంచి నేటి సాఫ్ట్ వేర్ అమ్మాయిల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. బంగారాన్ని తమ శరీరంపై వేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఇటీవల కాలంలో పురుషుల్లోనూ బంగారం, వెండి పై మక్కువ పెరగడంతో వీటికి మరింతగా డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
నేటి ధరలు...
ఇక మదుపరులు కూడా బంగారం, వెండి వస్తువులపై ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పెట్టుబడికి భద్రత ఉంటుందన్న భావనతో ఎక్కువ మంది వీటిపైనే పెట్టుబడి పెడుతుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,31,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,770 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,09,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండవచ్చని అంచనా.