Gold Prices Today : పసిడి ఇక కొనలేం..వెండి ఇంటికి తెచ్చుకోలేం
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరుగుదలను ఎవరూ నియంత్రించలేకపోతున్నారు. ఇప్పటికే తులం బంగారం లక్షన్నర రూపాయలు దాటేసింది. కిలో వెండి మూడున్నర లక్షల రూపాయలకు చేరువగా ఉంది. ఇక బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా బంగారం, వెండి ధరలు పసిడిప్రియులకు చుక్కలు చూపిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. డిమాండ్ కు సంబంధం లేకుండా ధరలు పెరుగదల ఒక్క బంగారం, వెండి విషయంలోనే సాధ్యమవుతుంది. ఒకసారి బంగారం, వెండి ధరలు పెరిగితే ఇక భారీగా పతనమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇప్పుడే కొనుగోలుకు...
అందుకే బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రత్యేకించి సమయం ఏదీ లేదని, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని, వెండి ధరలు కూడా ఇక అందుబాటులో ఉండకపోవచ్చన్న ది బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న అదనపు సుంకాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనుంది. దీంతో పాటు అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలు కూడా బంగారంపై ప్రభావం చూపనున్నాయి.
నేటి ధరలు...
ఇక రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. మాఘమాసం రావడంతో శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో డిమాండ్ తో పాటు ధరలు కూడా పెరిగే అవకాశముంది. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,790 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,40,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముంది.