Gold Price Today : భారీగా షాకిచ్చిన బంగారం ధరలు... పసిడిని మించి పరుగులు తీస్తున్న వెండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత పెరగనున్నాయని ముందు నుంచి హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజలుగా బంగారం, వెండి ధరలు పరుగును ఆపడంలేదు. గత ఏడాది జనవరి నెలలో మొదలయిన బంగారం, వెండి పెరుగుదల ఈ ఏడాది జనవరి నెలలోనూ కొనసాగుతుంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలు పై చిలుకు ధర పలుకుతుంది. ఇక ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
సెంటిమెంట్ గా...
బంగారం, వెండి వస్తువులు అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. సంప్రదాయంగా వస్తున్న ఆచారాల మేరకు బంగారాన్ని, వెండి ధరలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. బంగారం గ్రాము అయినా శుభకార్యానికి విధిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్తర భారత దేశంలోనూ, దక్షిణ భారత దేశంలోనూ ఇదే రకమైన సంస్కృతి ఉంది. సంప్రదాయాలను అనుసరించి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను విరివిగా కొనుగోలు చేస్తుండటంతో భారతదేశంలో ఎన్నటికీ బంగారానికి, వెండికి డిమాండ్ తగ్గదు.
నేటి ధరలు ఇలా...
పెట్టుబడులు పెట్టే వారు సయితం బంగారం వైపు చూస్తుంటారు. వెండి పై మదుపు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించడం ఒక్క వీటి విషయంలోనే సాధ్యమవుతుంది. నష్టం భారీగా వచ్చినా ఇందులోనే ఉంటుంది. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,31,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,780 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,10,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింతగా పెరిగే అవకాశముంది