Gold Rates Today : భారీగా షాకిచ్చిన బంగారం ధరలు...అందనంత దూరంలో వెండి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. గత కొన్నాళ్ల నుంచి కనిపిస్తున్న పెరుగుదల ఆగేటట్లు కనిపించడం లేదు. ఇక పెరుగుదల తప్పించి తగ్గడం అనేది జరగదన్న భావన వ్యక్తమవుతుంది. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్ లో ధరలు పెరగలేదు. గత ఏడాది జనవరి నెల నుంచి ప్రారంభమైన బంగారం, వెండి ధరలు ఈ ఏడాది మొదటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. డిమాండ్ పెద్దగా లేకపోయినా అనేక కారణాలతో ధరల పెరుగుదల ఆగడం లేదు. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇంకా ర్యాలీని కొనసాగించే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా నిర్ణయాలతో...
అమెరికా ప్రభుత్వం నిర్ణయాలతో బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం, వెండి పై పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాదిలో బంగారం ధరలు ఎనభై శాతం పెరిగాయి. వెండి ధరలు రెండు వందల శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావంతో బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు.
నేటి ధరలు...
ఫిబ్రవరి నుంచి మాఘమాసం మొదలవుతుంది. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సందడి ఆరంభం కానుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ధరలు పెరిగి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 2,800 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఇరవై వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,410 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3.60 లక్షల రూపాయలకు చేరింది.