Gold Rates Today : భగ్గుమన్న బంగారం.. మోతెక్కిన వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2026-01-20 04:08 GMT

బంగారం ధరలు మండిపోతున్నాయి. వెండి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం, వెండి ధరలు పరుగును ఆపేటట్లు కనిపించడం లేదు. బంగారం ఇప్పుడు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు బంగారానికి ఎప్పుడో దూరమయ్యారు. ఇప్పుడు ఎగువ తరగతి ప్రజలు కూడా బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు భయపడిపోతున్నారు. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరుకుంది. కిలో వెండి ధర మూడున్నర లక్షల రూపాయలకు చేరువలో ఉంది. ఇలా ధరలు పెరుగుతూ ఉంటే ఇక బంగారం, వెండి అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 2025 జనవరిలో ప్రారంభమయిన బంగారం, వెండి ధరల ర్యాలీ 2026 జనవరి వరకూ కొనసాగుతుంది.

ట్రంప్ సుంకాలతో...
పసిడి అంటే అంందరికీ మక్కువే. కానీ కొనాలంటేనే ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. బంగారం, వెండి ధరలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ వివిధ దేశాలపై విధించిన అదనపు సుంకాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలపై విధించిన పన్నుల మోత బంగారం మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దీంతో ధరలు పెరుగుతున్న సమయంలో కొనుగోళ్లు లేక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. బంగారం, వెండి కొనడం ఇక కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
నేటి ధరలు...
మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,060 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,250 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధరలు 3,18,000 రూపాయలుగా ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముంది.
Tags:    

Similar News