Gold Price Today : బంగారం షేక్ చేస్తుంది.. వెండి దడపుట్టిస్తుంది

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2026-01-17 03:37 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు ధరలు పెరుగతాయి తప్పించి తగ్గడం అనేది జరగదు. బంగారం ధరలు భారీగా పతనమవుతాయన్న ప్రచారాన్ని నమ్మవద్దని అనేక మంది బిజినెస్ నిపుణులు కూడా పదే పదే చెబుతున్నారు. బంగారానికి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. వెండి కూడా దూకుడుగా పరుగులు పెడుతూనే ఉంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మూడు లక్షలు దాటేసి ఇంకా ముందుకు వెళుతూనే ఉంది. ధరలు పెరగడం మాట పక్కన పెడితే ఇటీవల కాలంలో బంగారం, వెండి అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. అయినా ధరలు మాత్రం తగ్గడం లేదు.

అందరికీ ఆసక్తి...
బంగారం, వెండి విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. బంగారం ఉంటే భవిష్యత్ కు భద్రత ఉంటుందని భావిస్తారు. గతంలో కరోనా సమయంలోనూ ఉపాధి అవకాశాలు కోల్పోయినప్పుడు తమ వద్ద ఉన్న బంగారం తమను ఆదుకుందని భావించి ఏ మాత్రం అవకాశమున్నా, చేతుల్లో డబ్బులు ఉన్నా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో కేవలం మహిళలకే బంగారంపై ఎక్కువ మక్కువ ఉండేది. కాని నేడు పురుషులు కూడా పెట్టుబడిగా చూస్తుండటంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మ ంది ఆసక్తి చూపుతున్నారు.
నేటి ధరలు...
పెట్టుబడి పెట్టేవారు కొంత భయపడుతున్నప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు, దాంతో పాటు పరుగులు తీస్తున్న వెండి ధరలను చూసి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టేది బంగారం మాత్రమే. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,31,850 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,400 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 3,06,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News