Gold Rates : రికార్డు బ్రేక్ చేసిన బంగారం ధరలు...ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలతో పది గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటేసింది. ఇక కిలో వెండి ధర కూడా అదే పరుగులు పెడుతుంది. అనేక కారణాలతో గత కొన్ని కారణాలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా మరింత ఎక్కువయ్యా. ఈరోజు మరింతగా పెరిగి వినియోగదారులకు భారంగా మారాయి.
ఒక్కరోజులోనే...
రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాములపై 5,020 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1,54,800 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 4,600 రూపాయలు పెరిగి 1,41,900 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి ధరల .3,40,000 రూపాయలకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి.