Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా పతనమయిన బంగారం.. వెండి కూడా
నేడు బంగారం ధరలు భరీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఎగబాకుతున్న పసిడి కొంత శాంతించింది. వెండి ధరలు కూడా కొంత దిగి రావడం ప్రారంభించాయి. కానీ ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ముందు నుంచే అన్ని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అనుకున్నట్లుగానే ధరలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. ఇక మార్చి నాటికి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
అనేక కారణాలతో...
ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలకు విధిస్తున్న అదనపు సుంకాలు కూడా బంగారం, వెండి పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి వాటితో ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ వెండి ధరలు ఇంత గరిష్ట స్థాయికి పెరిగింది లేదు. అలాగే బంగారం ధరలు కూడా మరింతగా పెరిగి మదుపరులతో పాటు బంగారు ప్రియులను కూడా నిరాశలోకి నెట్టేస్తున్నాయి. ఉగాది నాటికి మరింతగా ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
మరొకవైపు ఫిబ్రవరి నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. అందుకే ధరలు మరింత పెరగుతాయన్న అంచనాలు వినిపస్తున్నాయి. భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,100 తగ్గి రూ.1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,290 పతనమై రూ.1,54,310 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.3,39,900 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. చెన్నై, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ముంబైలో అత్యల్పంగా కిలో వెండి రూ.3,24,900 పలుకుతోంది.