Loan Apps: గూగుల్‌ ప్లేస్టోర్‌లో 17 మోసపూరిత లోన్‌ యాప్స్‌.. ప్లేస్టోర్‌ నుంచి డిలీట్‌

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. మొబైల్‌లో రకరకాల యాప్స్‌ వేస్తుంటాము. అయితే వేసే ముందు..

Update: 2023-12-10 10:18 GMT

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. మొబైల్‌లో రకరకాల యాప్స్‌ వేస్తుంటాము. అయితే వేసే ముందు అవి ఎలాంటి యాప్స్‌ అనేవి గమనించము. కొన్ని మోసపూరితమైనవి కూడా ఉంటాయి. దీని వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ప్లే స్టోర్‌లో వివిధ లోన్‌ యాప్స్‌ కూడా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే 18 మోసపూరిత లోన్ యాప్‌లను ప్లే స్టోర్‌లో కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. దీంతో ఇతర దేశాలతో పాటు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తప్పుదారి పట్టించే 17 అప్లికేషన్లను ఇటీవల గూగుల్ తొలగించింది. ఓ నివేదిక ప్రకారం ఈ యాప్‌లు తీసివేయబడక ముందే ప్లేస్టోర్‌ నుంచి ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయి. ఇటువంటి తప్పుదారి పట్టించే ఆండ్రాయిడ్ లోన్ యాప్‌లకు ‘స్పైలోన్ యాప్‌లు’ అని పేరు పెట్టారు. ఈ స్పై లోన్‌ యాప్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

స్పైలోన్‌ యాప్స్‌ వినియోగదారులను చట్టబద్ధమైన రుణ ప్రదాతలపై ఉంచే నమ్మకాన్ని ఉపయోగించుకుంటాయి. అలాగే ప్రజలను మోసగించడానికి, చాలా విస్తృతమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి వివిధ మార్గాలను అనుసరిస్తున్నాయని నివేదికలు వెల్లడయ్యాయి. అలాగే బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి వేధించి సొమ్ము తస్కరించడమే ఈ యాప్‌లు ప్రధాన ఉద్దేశం. యాప్‌లు ప్రధానంగా భారతదేశం పాకిస్తాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, ఇండోనేషియా, కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, పెరూ, ఫిలిప్పీన్స్, సింగపూర్, నైజీరియా వంటి దేశాల్లో పనిచేస్తాయని వివరించారు. డేటా హార్వెస్టింగ్, బ్లాక్‌మెయిల్ కాకుండా, ఈ యాప్‌లు డిజిటల్ లోన్-షార్కింగ్ ఒక రూపాన్ని ప్రదర్శిస్తాయి. ఇలా ప్లే స్టోర్‌లో ఇలాంటి మోసపూరితమైన యాప్స్‌ను గుర్తించి తొలగించింది గూగుల్‌ ప్లేస్టోర్‌.

ESET రీసెర్చ్ నివేదిక ప్రకారం, ఈ హానికరమైన యాప్‌లు వినియోగదారులను వారి వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి విస్తృతమైన అనుమతులను మంజూరు చేసేలా మోసగించాయి. ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాప్‌లు సంప్రదింపు జాబితాలు, SMS సందేశాలు, ఫోటోలు, బ్రౌజింగ్ చరిత్రతో సహా అనేక రకాల సమాచారాన్ని దొంగిలిస్తాయి. ఈ డేటాను బ్లాక్ మెయిల్ చేయడానికి, అధిక వడ్డీ రేట్లతో రుణాలు తిరిగి చెల్లించమని బాధితులను వేధించడానికి ఉపయోగిస్తారు.

Tags:    

Similar News