Gold Rates Today : కొండెక్కిన పసిడి.. వేడెక్కిన వెండి.. ఇక కొనడం కష్టమే
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత ప్రియం కానున్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం ఇప్పట్లో బంగారం ధరలు దిగి వచ్చే అవకాశాలు లేవు. అలాగే వెండి కూడా పతనమయ్యే ఛాన్స్ లేదు. బంగారం, వెండి వస్తువులు మరింత భారంగా మారనున్నాయన్న అంచనాలు పెద్దయెత్తున వినపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో కొద్దిగా బంగారాన్ని కొనుగోలు చేయాలంటే కొంత ధరలు అందుబాటులో ఉండేవి. కానీ నేడు పెరిగిన ధరలను చూస్తుంటే ఎవరికీ అందనంత దూరంలో బంగారం ధరలు ఉన్నాయన్నది సుస్పష్టం.
అంచనాలు ఎప్పుడూ...
బంగారం విషయంలో అంచనాలు ఎప్పుడూ నిజం కావు. ఎవరి అంచనాలు కూడా పనిచేయవు. ఎందుకంటే బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విలువ, వెండి పట్ల ఉన్న మక్కువతో ఎన్నటికీ డిమాండ్ తగ్గదు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే వీలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం, వెండి వస్తువులను గతంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలోనే కొనుగోలు చేసేవారు. కానీ నేడు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బంగారం, వెండి కొంటే నష్టం ఏమీ ఉండదన్న భావనతో తమకున్న కొద్ది మొత్తాన్ని వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు.
నేటి ధరలు...
పసిడి ప్రియులు ఎంతగా ఇష్టపడిన బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడ సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. మరొకవైపు పెట్టుబడులు పెట్టేవారు కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,960 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,75,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండే అవకాశాలున్నాయి.