Union Budget : నిర్మలమ్మ ఈ వర్గాలకు ఊరట నిస్తున్నారటగా..గుడ్ న్యూస్ అదిరిందిగా

ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు

Update: 2026-01-27 04:27 GMT

జనవరి 28 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే నిర్మలమ్మ ఈసారి కొన్ని వర్గాలకు ఊరట దక్కేలా బడ్జెట్ ప్రసంగంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ప్రధానంగా ఆదాయపు పన్ను మినహాయింపుల్లో కూడా కొంత వెసులు బాటు ఇచ్చే ఆలోచన ఉందంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో పన్ను చెల్లింపుదారులకు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది. 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, ప్రజలపై పన్నుబాధ్యతను తగ్గించే దిశగా ఏడాది విడిభాగాలలో అనేక సవరణలు చేసింది. గత ఏడాది బడ్జెట్‌లోనూ కొత్త పన్ను విధానాన్ని మరింత సరళీకరించింది.

కొత్త పన్ను విధానంలో...
2020 నుండి కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో చేసిన మార్పుల వల్ల కొంత వేతన జీవులపై భారం తగ్గిందని చెప్పాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ భారత దేశంలో ఆదాయపు పన్ను పద్ధతి అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట ఆదాయ పరిమితిని మించి ఆదాయం ఉన్నవారు పాతా లేదా కొత్త పన్ను విధానాలలోని టాక్స్‌ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం, అప్పటి వరకూ ఉన్న పాత పద్ధతిని రద్దుచేయకుండా, ఆప్షన్‌గా కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కేంద్రం ప్రతి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంపై సవరణలు చేస్తూ వస్తుంది. ఇటీవలి కాలంలో, ఈ విధానాన్ని ఇంకా సులభతరం చేస్తూ, పన్ను రేట్లను తగ్గించడమే కాకుండా, మరిన్ని ప్రయోజనాలు కల్పించింది. అయితే, పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు జరుగలేదు.
పాత పద్థతిని....
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు త్వరలో పాత పద్ధతిని పూర్తిగా తొలగించవచ్చని కూడా అంటున్నారు.ఫిబ్రవరి 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. మినహాయింపులనుతొలగిస్తూ, ఐటీ రిటర్నులు సులభంగా ఫైల్ చేసుకునేలా ఎంచుకోవచ్చని తెలిపారు. మొదటిదశలో ఆప్షనల్‌గా ప్రారంభించి, తర్వాత డిఫాల్ట్‌గా మార్చారు.2023-24 బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చారు. పన్ను శ్లాబులలోనూ సవరణలు చేశారు. రూ. 0-3 లక్షల వరకు పన్ను లేదు, 6 లక్షల వరకు 5 శాతం, 9 లక్షల వరకు 10 శాతం, 12 లక్షల వరకు 15 శాతం, 15 లక్షల వరకు 20 శాతం, 15 లక్షలకు పైగా 30 శాతం పన్ను విధిస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000గా నిర్ణయించారు. సెక్షన్‌ 87A కింద టాక్స్ రిబేటును కూడా పెంచారు – రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను బాధ్యత లేదు.
పదిహేను లక్షల వరకూ...
2024-25 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి విప్లవాత్మక మార్పులు ప్రకటించారు. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను చెల్లించనక్కరలేదు. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే, వేతన జీవులకు12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. టాక్స్ రిబేటును రూ. 60 వేల వరకు పెంచారు. పన్ను శ్లాబులను కూడా గతంతో పోల్చితే మరింత సరళంగా చేశారు.ఈసారి బడ్జెట్‌లో కేంద్రం కొత్త పన్ను విధానంలో మరికొన్ని మార్పులు చేయనుందా లేదా, పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తుందా – అనే ఉత్కంఠ ఉంది. అలాగే, కొత్త విధానంలో మినహాయింపులను ప్రవేశపెట్టాలని, టాక్స్ రిబేటును పెంచాలని, రూ. 15 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకుండా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈసారి నిర్మలమ్మ ఎంత వరకూ ఆదాయంపై పన్ను లేకుండా చేస్తారన్నది మరో ఐదు రోజులు ఆగితే కాని తెలియదు.


Tags:    

Similar News