Gold Price Today : పండగ పూట కూడా షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. వెండి ధరలు ఇంకా పరుగులు పెడతాయి. పసిడి విషయంలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఖుషీగా ఉన్నారు. వెండి ధరలు కూడా ఇంకా ప్రియమవుతాయి. ఎవరు ఎన్ని చెప్పినా బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం పండగ వేళ కూడా భారీగా ధరలు పెరగడంతో వాటివైపు కూడా చూసేందుకు జంకుతున్నారు. ధరల పెరుగుదల విషయంలో మార్కెట్ నిపుణులు అందరూ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అనుకున్న స్థాయిలోనే బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
గత ఏడాది మొత్తం...
బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు గతంలో ఎగబడేవారు. బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉండటంతో కొంత శుభకార్యాల సమయంలో కానీ, పెళ్లిళ్లు వంటి సమయాల్లో ఎక్కువ కొనుగోలు చేసేవారు. 2024 నాడు వరకూ బర్త్ డే సెలబ్రేషన్స్ కు కూడా బంగారం, వెండి వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. అలాగే గత ఏడాది మొత్తం బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు ఏ మాత్రం పెరగలేదు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలు వంటివి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.
నేటి ధరలు...
ఇక రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింతగా పెరగనున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం, వెండి ధరలు ఎవరి అదుపులో ఉండవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,07,100 రూపాయలకు చేరుకుంది.