Gold Rates Today : గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? తగ్గినట్లు కనిపిస్తున్నా..?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. దిగిరావడం లేదు. బంగారం అంటేనే ఇప్పుడు అందని వస్తువుగా మారింది. లక్ష రూపాయలకు పైగానే ఉన్న బంగారం ధరలను చూసి కొనుగోలు చేయాలని భావిస్తున్నావారు కూడా బెంబేలెత్తిపోతున్నారు. వెండి ధరలు కూడా అదే తరహాలో పరుగులు పెడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం సామాన్యులతో పాటు ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారింది. గత కొన్నాళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగినా...
బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వల్ల బంగారం ధరలు పెరగడానికి కొంత కారణమయ్యాయి. అదే సమయంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, బంగారం దిగుమతులు తగ్గిపోవడం వంటి అంశాలు బంగారం, వెండి ధరల్లో మార్పులకు కారణమని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. అందుకే బంగారం ధరలు తగ్గుతాయని ఎదురు చూసే కంటే బంగారం ధర లక్షన్నరకు చేరుకునేలోపు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
స్వల్పంగా తగ్గి...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. త్వరలో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. థన్ తెరాస్ కూడా వస్తుంది. ఈ సమయంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయాలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,350 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,370 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,36,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరింతగా మార్పులు జరిగే అవకాశముంది.