Gold Prices Today: తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్న బంగారం.. వెండి అసలు దొరికేట్లు లేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-12-13 03:29 GMT

బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా బంగారం, వెండి ప్రయాణాన్ని చూసిన వారు ఎవరూ దీనిని నమ్మరు. పదేళ్ల క్రితం ఉన్న బంగారం ధరకు ఇప్పటికి అసలు పొంతనే లేదు. అరెరె.. అప్పుడే కొనుగోలు చేసి ఉంటే బాగుండేది కదా? అని అనుకునేలా ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఈ రేంజ్ లో పెరుగుతాయని పసిడి ప్రియులు కూడా ఊహించలేదు. కేవలం వినియోగదారులు మాత్రమే కాదు వ్యాపారులు కూడా ధరల పెరుగుదల ఇంత వేగంగా జరుగుతుందని భావించలేదు. కానీ గత ఏడాది ఇచ్చిన షాక్ తో ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు కూడా బంగారం, వెండి విషయంలో ఆందోళనకు గురవుతున్నారు.

బంగారం, వెండి రెండూ...
ఇక సాధారణ, మధ్యతరగతి కుటుంబాల వారితో పాటు వేతన జీవులు కూడా బంగారం కొనుగోలు చేయాలంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. బంగారం కంటే వెండి మరింత వేగంగా పరుగులు పెడుతుంది. ఇటీవల కాలంలో బంగారం కంటే వెండి పై పెట్టుబడులు పెట్టేవారు అధికం అయినట్లు వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఇప్పపికే పది గ్రాముల బంగారం ధర 1,30 లక్షల రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర రెండు లక్షలు దాటి ఎక్కడ వరకూ వెళ్లి ఆగుతుందో తెలయని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడమే తెలియని ఈ రెండు వస్తువులు అనేక మందికి దూరం అయ్యాయి.
భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రస్తుతం లేకపోవడంతో ధరలు పతనమవుతాయని భావించిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఇప్పుడు కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేనంతగా ధరలు పెరిగాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,210 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర 2.15,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరింతగా మార్పులు జరిగే అవకాశముంది.


Tags:    

Similar News