Gold Price Today : గుడ్ న్యూస్.. ఇక బంగారాన్ని కొనేయండి గురూ

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2025-12-11 03:37 GMT

బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అనేక మంది చెబుతున్నారు. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నాయి. వారి అంచనాలకు తగినట్లుగానే పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరువలో ఉండగా, కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలు దాటేసింది. ఇంకా ధరలు పెరిగే అవకాశముందన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం డాలర్ తో పోలిస్తే రూపాయ ధర క్షీణిస్తుండటంతో పాటు డాలర్ మరింతగా బలపడుతుండటం, విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, బంగారం, వెండి దిగుమతులు తగ్గడం కూడా వీటి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ ఏడాది మొత్తం...
ఈ ఏడాది మొత్తం బంగారం ధరలు పెరుగుతూ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఈ ఏడాది పెరిగినట్లుగా ఏ ఏడాది కూడా ధరలు పెరగలేదు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నాయి. అయితే కొత్త ఏడాదిలోనైనా బంగారం, వెండి వస్తువులు మధ్యతరగతి, వేతనజీవులకు అందుబాటులోకి వస్తుందా? అంటే డౌటే. బంగారం ధర పెరగకపోయినా.. తగ్గకపోయినా.. స్థిరంగా కొనసాగితే చాలు అనే పరిస్థితికి కొనుగోలు దారులు వచ్చేశారు. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ లేకపోయినా పండగలు, కొత్త ఏడాది ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం భావిస్తుంది. కొత్త కొత్త డిజైన్లతో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
నేటి ధరలు...
పెట్టుబడి పెట్టేవారు కూడా కొంత ఆలోచన లో పడ్డారు. నగలు అనేది సంప్రదాయంలో భాగమైంది. డైమండ్ జ్యుయలరీ, బంగారం ఆభరణాలకు గిరాకీ ఎప్పటికీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం కొనుగోలు చేయలేనివారు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,320 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,07,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News