Gold Price Today : భయపెడుతున్న బంగారం.. బెంబేలెత్తిస్తున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. ప్రతి రోజూ బంగారం ధరలు పెరగుతూనే ఉన్నాయి. పసిడి ధరలు పరుగులు పెట్టడం చూసిన వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు. ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా కష్టమేనని అంటున్నారు. ఇప్పటి వరకూ బంగారం, వెండి ధరలు అందుబాటులోకి వస్తాయని భావించారు. కానీ చూస్తుంటే ఇక ధరలు తగ్గవని అర్థమవుతుంది. వెండి ధరలు అయితే పట్టుకోలేకపోతున్నాం. రెండు లక్షలు దాటేసిన కిలో వెండి వైపు చూసేందుకు కూడా కొనుగోలు దారులు చూడటం లేదు. వెండి ఇప్పుడు భయపెడుతుంది. బంగారం బెంబేలెత్తిస్తుంది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు.
గతంలో పెరిగినా...
గతంలో పెరిగినప్పటికీ పెరుగుదల క్రమంగా... ఉండేది. కానీ నేడు పెరిగితే మాత్రం వందలు.. వేల రూపాయలు పెరుగుతుండటంతో ధరలను అదుపు చేయడం ఎవరి చేతుల్లో లేకపోవడంతో వాటిని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. దీంతో ఈ ప్రభావం కొనుగోళ్లపై కూడకా పడ్డాయి. బంగారం, వెండి కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు నిలిచిపోవడంతో జ్యుయలరీ దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బంగారం పై ఆశ పూర్తిగా చచ్చిపోయిందని వినియోగదారులే చెబుతున్నారు. బంగారం లేకుంటే బతకలేమా? దానిని కొనుగోలు చేయడం కంటే మరొకటి కొనుగోలు చేయడం మంచిదన్న అభిప్రాయంలో వినియోగదారులు ఎక్కువ మంది వచ్చారు.
నేటి ధరలు...
మరొకవైపు శుభకార్యాల సీజన్ కాకపోవడం, ప్రస్తుతం మూఢమి నడుస్తుండటంతో బంగారం, వెండి వస్తువుల అమ్మకాలు మరింత దారుణంగా పడిపోయే అవకాశముందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,860 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,760 రూపాయలుకు చేరుకుంది. కిలో వెండి ధర 2,09,100 రూపాయలకు చేరుకుంది.