Gold Price Today : గుడ్ న్యూస్.. పసిడి కొనాలనుకునే వారు ఇప్పుడు కొనేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2025-12-10 03:27 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అవి అస్సలు ఆగడం లేదు. వెండి ధరలు కూడా బంగారం తో పాటు పరుగులు పెడుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతుండటం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. సీజన్ కాకపోవడంతో వినియోగదారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అదే పెళ్లిళ్ల సీజన్ అయితే మాత్రం ఇబ్బందులు పడేవారు. బంగారం, వెండి ప్రియులకు 2025 సంవత్సరం చేదు సంవత్సరమనే చెప్పాలి. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు పెరిగినట్లుగా ఇంతకు ముందు ఎన్నడూ పెరగలేదు. అయితే గతంలో బంగారం కొనుగోలు చేసిన వారు మాత్రం ఈ ఏడాది వాటిని విక్రయించుకుని లాభపడ్డారు.

కొనుగోలు చేయడానికి...
బంగారం విషయంలో అందరూ ఆచి తూచి అడుగులు వేస్తారు. శుభకార్యాలు మినహాయించి ఇప్పుడు బంగారం కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మహిళలు తమకు ఇష్టమైన బంగారాన్ని సొంతం చేసుకోవడానికి గతంలో సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేవారు. కానీ నేడు పెరిగిన ధరలతో బంగారం బదులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు ఇతర ఆభరణాలను ధరించి శుభకార్యాలకు వెళ్లటం అలవాటు చేసుకున్నారు. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ బలపడటం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో పోలిస్తే రూపాయి తగ్గుదల వంటివి బంగారం పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు తగ్గి...
ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒక బలమైన కారణం ఉండాలి. అదీ పెళ్లిళ్లకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో బంగారం, వెండి ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,18,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,430 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,99,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మారే అవకాశముంది.


Tags:    

Similar News