గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణాలను తీసుకున్న వారికి భారీ ఊరట లభించినట్లయింది. కొద్దిసేపటి క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. వడ్డీరేట్లను తగ్గించడతో గృహ, వాహన రుణగ్రహీలకు ఊరట లభించినట్లయింది.
వడ్డీరేట్లపై ఇప్పటికే...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. మరోసారి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. దీంతో రుణాలుపొందిన వారు కొంత వరకూ ఊరట చెందినట్లే.