Ys Jagan :చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి... జగన్ తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చేయాలని ప్రభుత్వం భావించడం అన్యాయమని వైఎస్ జగన్ తెలిపారు. రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడితే దానిని అణిచి వేయాలని పోలీసులను ఉపయోగించిందన్నారు. రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని అన్నారు. అయితే ఆందోళనకు దిగుతామని ముందుగానే చెప్పినా అర్ధరాత్రి తమ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ ఆరోపించార.
యూరియా కొరతతో...
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారని, అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన మీడియాకు చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే రైతులు క్యూ కట్టారని అన్నారు. సకాలంలో యూరియా, ఎరువులు ఇస్తే రైతులు రోడ్డెక్కేవారు కాదుకదా? అని ఆయన ప్రశ్నించారు. తమ పాలనలో ఎప్పుడైనా రైతులు రోడ్డెక్కెరా? అని నిలదీశారు. చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి అని తీవ్ర వ్యాఖ్యలు చేవారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో పాలన ప్రజాపాలన కోసం సాగుతుందా? లేక దోపిడీ దారుల కోసమా? అన్నది తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
రైతుల జీవితాలతో ఆటలు...
రాష్ట్రంలో విద్య, వైద్యం పడకేశాయని వైఎస్ జగన్ అన్నారు. 6.65 లక్షల టన్నుల యూరియాను తాము పంపిణీ చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారని, 9 రెండునెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ హాయంలో బ్లాక్ మార్కెట్ చేస్తే ఉద్యోగాలు ఊడతాయని అధికారులను హెచ్చరించేవారమని, అందుకే తమ పాలనలో బ్లాక్ మార్కెట్ కు అవకాశం లేకుండా పోయిందని వైఎస్ జగన్ అన్నారు. రైతుల కోసం తాము పోరాడితే తప్పేంటి? అని వైస్ జగన్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం స్కాంలు కోసం డబ్బులు దండుకోవాలని చూస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ అన్నారు. మిర్చి పొగాకు, మామిడి, ఉల్లి ధరలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. రైతుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ జగన్ అన్నారు.