Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-01-28 03:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆర్టీసీ పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఖాళీగా ఉన్న 7673 రెగ్యులర్ పోస్టులను...
ఖాళీగా ఉన్న 7673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ లు, శ్రామిక్ లు, తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ.800 నుంచి 1000 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండకర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900కు పెంచింది.


Tags:    

Similar News