Ys Jagan : నేడు భీమవరం నేతలతో జగన్ సమావేశం

నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు

Update: 2026-01-28 03:49 GMT

నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్‌ సమావేశం కానున్నారు. భీమవరం నియోజకవర్గంలో పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అవుతారు.

వరస సమీక్షలు...
ఇటీవల జగన్ నియోజకవర్గాల వారీగా తాను ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గత వారం ఏలూరు నియోజకవర్గం పార్టీ నేతలతో సమావేశమయిన జగన్ నేడు భీమవరం నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను, లీడర్లను సమాయత్తం చేయడంలో భాగంగా వరసగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News