రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ గా మారింది : వైఎస్ జగన్
రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ గా మారిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ గా మారిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. భీమవరం నియోజకవర్గం నేతలతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం ఉందని అన్నారు. విచ్చలవిడితనం, హద్దులేని బరితెగింపులు నిత్యకృత్యమయిందని అన్నారు. అన్ని వ్యవస్థలూ దారుణంగా నిర్వీర్యం చేశారని జగన్ అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు పతనం అయ్యాయన్న జగన్ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతుందని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అన్యాయమైన పాలనను ఎండగట్టాలని, ఆ దిశలో కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని, మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలన్నారు.
రెండు ప్రభుత్వాల మధ్య తేడా...
దానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చూడాలన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర ఉంంటుందన్న జగన్ వారి ద్వారానే రెండు ప్రభుత్వాల మధ్య తేడా చూపిస్తాంజగన్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలిందని, మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయన్నారు.