Andhra Pradesh : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది

Update: 2026-01-28 02:22 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయాక ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మాత్రమే వెల్లడించింది. గ్రూప్ 2 పోస్టులో స్పోర్ట్స్ కోటాలో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని విడుదల చేయలేదు.

891 పోస్టులకు సంబంధించి...
అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎక్సైజ్ ఎస్టై, లా ఏఎస్ఓల పోస్టులను కూడా ప్రకటించలేదు. మిగిలిన 891 పోస్టుల్లో హైకోర్టు తీర్పు మేరకు హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మరో ఇరవై ఐదు పోస్టుల్లో మార్పులు జరిగే అవకాశముందని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. 905 పోస్టుల భర్తీ కోసం 2023 డిసెంబరు 7 ప్రకటన జారీ చేయగా, 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News