Pawan Kalyan : నేడు ఢిల్లీలో పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, హోం మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
అమిత్ షాతో జరిగే భేటీలో...
అమిత్ షాతో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా పవన్ కల్యాణ్ చర్చించే అవకాశాలున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, బడ్జెట్ లో ఏపీకి న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరనున్నారు.