Tirumala : తిరుమలకు భక్తుల రద్దీ ఇంతగా ఉండటానికి కారణం ఏంటంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-01-28 03:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. తిరుమలకు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన మొదలయిన వైకుంఠ ఏకాదశి నుంచి నేటి వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. తిరుమలకు ఊహించని విధంగా భక్తులు వచ్చినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తు్న్నారు. వసతి గృహాల విషయంలోనూ కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

వివిధ రూపాల్లో వస్తూ...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గతంలో మాదిరిగా ఎన్నడూ ఇంత భారీగా తరలి వస్తుండటం గతంలో ఎన్నడూ లేదు. గతంలో సెలవుల సమయంలోనూ, వేసవి సెలవుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లు విక్రయిస్తుండటంతో పాటు ఎప్పటికప్పుడు ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో పాటు కాలినడకన వచ్చే భక్తులకు సత్వర దర్శనం ఏర్పాటు చేస్తుండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,469 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News