Ys Jagan : ఈ నెల 17న గవర్నర్ తో జగన్ భేటీ
ఈనెల 17న గవర్నర్‌తో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
ఈనెల 17న గవర్నర్‌తో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అపాయింట్‌మెంట్ ఖరారయింది. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు.
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై...
17వ తేదీ సాయంత్రం సా 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైసీపీ కార్యాలయానికి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్ గారికి చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు